Skip to main content

Posts

Showing posts from January, 2026

కబడ్డీ కోర్టు కోసం మట్టి పోయించిన ఉపసర్పంచ్ రాజు శర్మ

కబడ్డీ కోర్టు కోసం మట్టి పోయించిన ఉపసర్పంచ్ రాజు శర్మ  అంజనేయులు టీవీ , 21 జనవరి , ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మూడవ వార్డులో కబడ్డీ కోర్టు ఏర్పాటు కోసం గంగాధర క్షేత్ర వ్యవస్థాపకులు దామోదర శర్మ జ్ఞాపకార్థం, ఉప సర్పంచ్ మూగు నాగరాజ్ శర్మ మట్టి కుప్పలను పోయించారు. మూడవ వార్డులోని యువకులు కబడ్డీ కోర్టును ఏర్పాటు చేయాలని రాజు శర్మకు విన్నవించగా, వెంటనే ఆయన తన సొంత ఖర్చులతో ట్రాక్టర్లతో మట్టి కుప్పలను పోయించారు. ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు సభ్యులు శ్రీమతి మామిడి సుశీల, మామిడి రాజు, అంగన్వాడి టీచర్ బైరి అరుణ, నార్ల దినేష్, మామిడి అనిల్, తదితరులు పాల్గొన్నారు.

జాతర పోస్టర్ ఆవిష్కరణ

జాతర పోస్టర్ ఆవిష్కరణ శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే   సమ్మక్క సారక్క జాతర పోస్టర్ ను ఎల్ఎండిలోని ప్రజాభవన్లో ఆదివారం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు నిర్వాహకులు కల్పించినట్లు చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి వనదేవతల అనుగ్రహం పొందాలని ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో కేశపట్నం సమ్మక్క సారక్క జాతర చైర్మన్ గుర్రం స్వామి గౌడ్, టెంపుల్ కార్య నిర్వహణ అధికారి మారుతీరావు, శంకరపట్నం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, ధర్మకర్తలు గొడిశాల శ్రీనివాస్, గుర్రం బుచ్చయ్య గౌడ్, గుర్రం శ్రీనివాస్, జనగాం శ్రీనివాస్,బొజ్జ కోటి, మేకల కోటి,  షారుక్ తదితరులు పాల్గొన్నారు.